NTV Telugu Site icon

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిరిగి జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్స్..!

Kl Rahul

Kl Rahul

ఆసియా కప్‌-2023 నాటికి భారత మిడిలార్డర్‌ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. గాయాల బారిన పడి చికిత్సలు చేయించుకున్న ఈ ఇద్దరు.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తూ చెమటోడుస్తున్నారు. మెగా ఈవెంట్‌ స్టార్ట్ అయ్యేసరికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా వీరిద్దరు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీఏలో ఉన్న మరో స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ వీరిద్దరి గురించిఅప్‌డేట్‌ ఇచ్చాడు.

Read Also: Uttar Pradesh: భార్య చేసిన కూర నచ్చలేదని చంపేసిన భర్త

శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను రిషబ్ పంత్ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. టీమిండియా అభిమానులను అలరిస్తున్న ఈ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ ఏడాది టీమిండియా ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ రూపంలో రెండు కీలక టోర్నీలు ఆడుతుంది. అయితే, అయ్యర్‌ గాయపడి జట్టుకు చాలా రోజులు దూరంగా ఉన్న నేపథ్యంలో మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం సమస్యగా మారింది. మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఆ ప్లేస్‌లో అయ్యర్‌ ఇప్పుడిపుడే కుదురు కుంటున్న తరుణంలో వెన్నునొప్పి రూపంలో సమస్య వెంటాడింది.

Read Also: Hansika Motwani : పొట్టి నిక్కరులో థైస్ షోతో మతి పోగొడుతున్న యాపిల్ బ్యూటీ..

ఈ మెగా ఈవెంట్లకు కూడా శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాకపోతే.. యువ సంచలనం తిలక్‌ వర్మను అతడి స్థానంలో ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా రిషబ్ పంత్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి శ్రీలంక, పాకిస్తాన్‌ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది.