NTV Telugu Site icon

Rishabh Pant: మరో అంతర్జాతీయ అవార్డు రేసులో రిషబ్ పంత్

Rishabh

Rishabh

Rishabh Pant: రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. మృత్యువును ఓడించి క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ (Laureus World Sports Awards) విభాగంలో నామినేట్ అయ్యాడు.

Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!

డిసెంబర్ 2022లో పంత్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న పంత్, ఆ తర్వాత అతని దృఢ సంకల్పం, కఠోర శ్రమ కారణంగా.. అతను గత సంవత్సరం ఐపీఎల్ ద్వారా మైదానంలోకి తిరిగి వచ్చాడు. బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబెక్కా ఆండ్రేడ్ కూడా ఈ విభాగంలో నామినేట్ అయ్యారు. ఆమె లిగమెంట్ గాయం నుండి తిరిగి వచ్చి పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఇతర పోటీదారుల విషయానికి వస్తే.. స్విట్జర్లాండ్‌కు చెందిన 33 ఏళ్ల స్కీ రేసర్ లారా గట్ బెర్హామి, ఆస్ట్రేలియాకు చెందిన ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ స్విమ్మర్ అరియార్నే టిటామాషెవ్ లు ఈ లిస్ట్ లో స్థానం సంపాదించారు. విజేతను ఏప్రిల్ 21న ప్రకటిస్తారు.

Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!

డిసెంబర్ 30, 2022న పంత్ ఒక ఘోర కారు ప్రమాదానికి గురై.. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత, 27 ఏళ్ల పంత్ గత ఏడాది ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం 629 రోజుల తర్వాత మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత పంత్ టెస్ట్ క్రికెట్‌లోకి కూడా విజయవంతమైన పునరాగమనం చేశాడు. కారు ప్రమాదం తర్వాత తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు. ఇప్పుడు పంత్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాధ్యత వహించనున్నాడు.