Site icon NTV Telugu

Rishabh Pant: దేశం కోసం చేద్దాం గయ్స్.. టీమిండియాకు రిషబ్ పంత్ మెసేజ్!

Rishabh Pant Mesaage

Rishabh Pant Mesaage

Rishabh Pant’s Emotional Message to Team India Before 5th Test: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. వాషింగ్టన్‌ సుందర్ (101 నాటౌట్‌), రవీంద్ర జడేజా (107 నాటౌట్‌)ల గొప్ప పోరాటంతో మాంచెస్టర్‌ టెస్టును భారత్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన కీపర్ రిషబ్ పంత్ క్రీజ్‌లోకి రానవసరం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కోసం గాయంతోనే బరిలోకి దిగిన పంత్.. అవసరమైతే రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు వస్తాడని బీసీసీఐ పేర్కొంది. అయితే జడేజా, సుందర్ పోరాటంతో పంత్ క్రీజులోకి రాలేదు. గాయం కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణ్ జగదీశన్‌ జట్టులోకి వచ్చాడు.

Also Read: Ravindra Jadeja: కెప్టెన్ శుభ్‌మాన్ మాట వినని జడేజా.. వీడియో వైరల్!

చివరి టెస్టుకు దూరమైన రిషబ్ పంత్ భారత జట్టుకు తన సందేశం ఇచ్చాడు. చివరి టెస్టులో గెలిచి దేశంకు కానుకగా ఇద్దామని ట్వీట్ చేశాడు. ‘నా జట్టుకు ఓ మెసేజ్. గయ్స్ మనం తప్పకుండా ఐదో టెస్టులో గెలుద్దాం. దేశం కోసం ఇది చేద్దాం. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు ఏం చేయాలనేది వ్యక్తిగతంగా చేయాలనుకుంటా. ఈ సమయంలో సహచరులంతా నాకు అండగా నిలవడం బాగుంది. దేశం కోసం ఆడేటప్పుడు ఏ సమయంలో అయినా ప్రతిఒక్కరూ మద్దతు ఇస్తారు. ఆ భావోద్వేగాలను చెప్పడం కష్టం. నా దేశం తరఫున ఆడడాన్ని నేను ఎప్పుడూ గర్వంగానే భావిస్తా’ అని పంత్ పేర్కొన్నాడు.

Exit mobile version