Site icon NTV Telugu

Rishabh Pant: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కాబోలు.. రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మంగళవారం రాత్రి జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో మరోసారి ప్రాబ్లమ్ LSGను వెంటాడింది. మూడోసారి స్లో ఓవర్‌రేట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా పడింది. అంతేకాదు జట్టులోని ఇక మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు 50 శాతం (ఏది తక్కువైతే అది) ఫైన్ గా పడింది.

Read Also: Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..

ఇకపోతే, మ్యాచ్‌లో రిషబ్ పంత్ తన బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. 61 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, జట్టు విజయం సాధించలేకపోయింది. బెంగళూరుతో జరిగిన పోరులో 227 పరుగుల భారీ స్కోర్ చేసినా కూడా, ఆ జట్టుకి పరాజయం తప్పలేదు. ఇక ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఓవర్ రేట్ స్లోగా ఉండటంతో, LSG కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించబడింది. అలాగే మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు (ఏది తక్కువ ఉంటే అది) జరిమానాగా విధించబడిందని వెల్లడించారు.

Read Also: Naga Vamsi: టీడీపీకి 25 లక్షల విరాళం..

ఇది లక్నో జట్టుకి మూడవసారి ఓవర్రేట్ ఉల్లంఘన కావడంతో కఠినమైన చర్యలు తీసుకున్నారు. గతంలో కూడా ఏప్రిల్ 4న, 27న ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లలో ఇదే తప్పిదాన్ని లక్నో జట్టు చేసింది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడినా, మరోవైపు జితేశ్ శర్మ అద్భుతంగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే 85 పరుగులు చేసి, ఆర్సీబి జట్టుకు విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి పవర్‌ప్లేలో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, జితేశ్ ఆడిన ఇన్నింగ్స్ తో RCBకి IPL చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన ఛేజింగ్‌గా నిలిచింది. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు క్వాలిఫయర్ 1లోకి ప్రవేశించగా, మే 29న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక లక్నో జట్టు ఏడవ స్థానంతో టోర్నమెంట్‌ను ముగించింది.

Exit mobile version