Site icon NTV Telugu

Rishabh Pant: సారీ చెప్పిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమితో ప్రస్తుతం భారత జట్టులో నిరాశ వాతావరణం నెలకొంది. గౌహతి టెస్ట్‌లో జట్టుకు నాయకత్వం వహించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఈ టెస్ట్‌లో తన పేలవమైన ప్రదర్శనకు క్షమాపణలు చెబుతున్నానని పంత్ పేర్కొన్నాడు. అయితే తాను మరింత కష్టపడి తిరిగి వస్తానని పంత్ వెల్లడించాడు. గౌహతి టెస్ట్‌లో రిషబ్ పంత్ ఔటైన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

READ ALSO: Mangli: నా ‘బాయిలోనే’ పాటను కించపరిచారు.. మంగ్లీ పోలీస్ కంప్లెయింట్..!

రిషబ్ పంత్ సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ చేశాడు.. అందులో ” గత రెండు వారాల్లో మేము బాగా రాణించలేదనే వాస్తవాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, వ్యక్తులుగా, మేము ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాము, అలాగే లక్షలాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలనుకుంటున్నాము.. కానీ క్షమించండి, ఈసారి మేము ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాము, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మా జీవితంలో అతిపెద్ద గౌరవం. ఈ జట్టు సామర్థ్యం ఏమిటో మాకు తెలుసు, మేము కష్టపడి పనిచేస్తాము, కలిసి, బలంగా తిరిగి వస్తాము. మీ అచంచలమైన మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. జై హింద్ ” అని పంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా తరఫున ఏ బ్యాట్స్‌మన్ కూడా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, పంత్ ప్రదర్శన చాలా దారుణంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు, సగటు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రెండు టెస్టుల్లో కేవలం 49 పరుగులు మాత్రమే చేశాడు. గౌహతి టెస్టులో పంత్ వికెట్‌ కోల్పోయిన తీరు నిజంగా షాకింగ్‌గా ఉంది. అలాగే ఈ టెస్ట్‌లో పంత్ స్టాండింగ్ కెప్టెన్‌గా, తన టీం ఆటగాళ్లపై కోపాన్ని వ్యక్తం చేయడం కూడా కనిపించింది. మొత్తం మీద ఈ సిరీస్ పంత్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇప్పుడు పంత్ దీని నుంచి ఎలా తిరిగి ఎలా బయటికి వచ్చి తన సత్తా చూపిస్తాడు అనేది వేచి చూడాలి.

READ ALSO: Vijay Sethupathi: జైలర్-2 లోకి ఎంట్రీ ఇవ్వనున్న పూరీ హీరో..

Exit mobile version