Site icon NTV Telugu

Police Operation: పోలీసులు, స్మగ్లర్ల ముఠాకు మధ్య కాల్పులు.. 64 మంది మృతి

Brazil

Brazil

Brazil Police Operation: బ్రెజిల్ లోని రియో ​​డి జనీరోలో రెడ్‌కమాండ్ ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు జరిపిన ఈ ఆపరేషన్ లో కనీసం 64 మంది మరణించారు. రియో ​​డి జనీరో ప్రాంతంలో మంగళవారం సుమారు 2,500 మంది పోలీసులు, సైనికులు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 81 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ దాడి సమయంలో పోలీసులకు, స్మగ్లింగ్ ముఠా సభ్యులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం 64 మంది మరణించారు. వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఏడాదికి పైగా ప్లాన్ చేసినట్లు తెలిపారు.

READ MORE: Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి..

ఆపరేషన్ కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ సమయంలో అధికారులు కనీసం 42 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. తొలుత భద్రతా దళాలు ముఠా నియంత్రణలో ఉన్న అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. వెంటనే కాల్పులు జరిపారు. పోలీసులను లక్ష్యంగా చేసుకోవడానికి ముఠా సభ్యులు డ్రోన్‌లను ఉపయోగించారని ప్రభుత్వం చెబుతోంది. పెన్హా కాంప్లెక్స్‌లోని పోలీసు అధికారులపై దాడి చేయడానికి నేరస్థులు డ్రోన్‌లను ఉపయోగించారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంతలో, రియో ​​డి జనీరోలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై పోలీసుల దాడిని భయంకరమైనదిగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అభివర్ణించింది.

READ MORE: Cyclone Montha: అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలం.. లైట్‌హౌస్‌ని తాకుతున్న కెరటాలు!

రెడ్ కమాండ్ (కమాండో వెర్మెల్హో) అనేది బ్రెజిల్‌కు చెందిన ఒక క్రిమినల్ ముఠా. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా, ప్రత్యర్థి ముఠాలతో టర్ఫ్ యుద్ధాలు, ఇతర నేర కార్యకలాపాలకు పాల్పడుతుంది. ఈ ముఠా 1979లో రియో ​​డి జనీరోలోని ఒక జైలులో స్థాపించారు. సాధారణ నేరస్థులు, రాజకీయ ఖైదీలు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డారు. ఈ ముఠా కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది.

Exit mobile version