మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) చిన్న వయసులోనే (Rinky chakma) ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం ఆమె ఈ లోకాన్ని విడిచారు.
కేన్సర్‌కు సంబంధించి శస్త్రచికిత్స జరిగినప్పటికీ.. ప్రాణాంతక వ్యాధితో రెండేళ్ల పోరాటం తర్వాత తుదిశ్వాస విడిచారు. ఫెమినా మిస్ ఇండియా సోషల్ మీడియాలో శ్రీమతి చక్మా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఇటీవలే ఆమె తాను ఎదుర్కొన్న ఛాలెంజింగ్ జర్నీ గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. కష్ట సమయంలో అండగా ఉన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. కేన్సర్ నిర్ధారణ అయిన దగ్గర నుంచి రెండేళ్ల నుంచి ఒంటరిగా కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆమె ప్రాణాంతక ఫైలోడెస్ ట్యూమర్ (రొమ్ము క్యాన్సర్) తో బాధపడ్డారు.
తాను కీమోథెరపీ చేయించుకుంటున్నానని.. బ్రెయిన్ సర్జరీ కూడా చేయించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ సమస్య వల్ల కుటుంబం సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఆమె ప్రాణాలు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచి వేసింది.
చికిత్స కోసం పొదుపు చేసిన డబ్బులన్నీ అయిపోయాయని.. విరాళాలు కూడా స్వీకరించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన కోసం ప్రార్థనలు కూడా చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో పంచుకుంది.