Site icon NTV Telugu

Rifle : వరంగల్ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య కార్మికుడికి దొరికిన రైఫిల్

Rifle Warangal

Rifle Warangal

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికుడు శుక్రవారం ఉదయం ఎంజీఎం జంక్షన్‌ వద్ద 58 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన సెల్ఫ్‌లోడింగ్‌ రైఫిల్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌)ను గుర్తించారు. నివేదికల ప్రకారం, ఒక పారిశుధ్య కార్మికుడు, MGM జంక్షన్ గుండా వెళుతుండగా రోడ్డుపై రైఫిల్‌ను గమనించాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, వారు రైఫిల్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడేకు అందజేశారు. ఇది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌గా గుర్తించిన కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎంజీఎం జంక్షన్‌ మీదుగా వెళ్తుండగా సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన ట్రక్కు నుంచి రైఫిల్ కిందపడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌ను సీఆర్‌పీఎఫ్‌ అధికారులకు అప్పగించారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
 

Exit mobile version