NTV Telugu Site icon

Ridge Gourd Farming: బీర సాగులో అధిక లాభాలు పొందాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు..

Bera

Bera

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయల పంటలలో బీరకాయ కూడా ఒకటి.. ఈ పంటను తక్కువ ఖర్చుతో పండించవచ్చు.. ఒకప్పుడు ఈ బీర సాగును రైతులు నేలపై పాటించేవారు. ఆ విధానంలో పెద్దగా దిగుబడులు వచ్చేవి కావు. నేడు కొందరు రైతులు అడ్డ పందిరి విధానంలో బీర సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు… ఇప్పుడు దాదాపు అందరు ఇలానే పండిస్తున్నారు..

రామా అనే కంపెనీ బీర విత్తనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ విత్తనాలతో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం తీస్తున్నారు. 25 సెంట్లలో రోజు మార్చి రోజు వంద కేజీల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు. కిలో రూ.40కి విక్రయించారు. 25 సెంట్లలో 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఇలా సగటున కిలో రూ.30 ధర అనుకున్నా 25 సెంట్లలో రూ.90 వేల ఆదాయం సంపాదిస్తున్నారు..

అడ్డు పందిరితో అధిక లాభాలను పొందవచ్చు..?

విత్తనాలు నాటిన నెల రోజులు తర్వాత అడ్డు పందికి పాకిస్తారు. ముందుగా అవు కర్రలు వాటిని అల్లుతూ లంగరు వైరు చుట్టి వాటికి బీర మొక్కలను పాకిస్తున్నారు. తీవ్రమైన గాలులు వచ్చినా అడ్డు పందిరి పడిపోకుండా కట్ట కర్రలు ఉపయోగిస్తున్నారు. లంగరు తీగ కేజీ రూ.300 ఉంటుంది. 25 సెంట్ల భూమికి 5 కేజీలు అవసరం అవుతుంది. అంటే 25 సెంట్లకు రూ. 1500 ఖర్చవుతోంది. లావు తాడు మరో 5 కేజీలు అవసరం ఉంటుంది.. నెల రోజులు పాకిన మొక్కను ఇలా వైర్లకు పాకిస్తారు.. ఇలా చెయ్యడం వల్ల దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. కాయ కోయడం కూడా చాలా తేలిక. 75 రోజులకే బీర లో మంచి దిగుబడులు తీయవచ్చని పార్వతీశం తెలిపారు. పంట వేసిన రెండున్నర నెలల నుంచి ఆ తరవాత మూడు నెలల వరకు దిగుబడి వస్తుంది. ఇలా 105 రోజుల పాటు రోజు విడిచి రోజు బీర కాయలు కోతకు వస్తాయి.. ఒక్క బీరను మాత్రమే కాదు..తీగ జాతి కూరగాయలను ఇలా పండించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు..