Richest Female Cricketers: ఆటే కాదు సంపదలో కూడా ఘనమే.. టీమిండియా రిచెస్ట్ మహిళా క్రికేటర్స్ వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Richest Female Cricketers: నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ విజయం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సాధించిన ఈ విజయం కేవలం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక క్రీడా మైలురాయిగా మాత్రమే కాకుండా.. అనేక సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆశల మిళితంగా నిలిచింది. భారత్ ఈ ట్రోఫీని ఎత్తగానే దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో మహిళల క్రికెట్ భారత క్రీడా రంగంలో ఒక కొత్త దిశను సృష్టించింది. ముఖ్యంగా ఈ విజయం వల్ల క్రీడాకారిణుల పేరు మాత్రమే కాదు.. వారి ఆర్థిక స్థాయిలో కూడా గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. మరి టీమిండియా రిచెస్ట్ మహిళా క్రికేటర్స్ ఎవరో చూసేద్దామా..
World Cup 2025 గెలిచినా విక్టరీ పరేడ్ లేదా..? BCCI ఏమందంటే..?
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
భారత మహిళా క్రికెటర్లలో అత్యంత సంపన్నురాలు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. ఆమె నికర విలువ సుమారు 40 – 45 కోట్ల మధ్య ఉంది. ఆమె తర్వాత స్మృతి మంధాన ఉన్నారు. ఆమె నికర విలువ 32 – 34 కోట్లుగా అంచనా వేయబడింది. ఆపై ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నికర విలువ రూ.25 కోట్లకు చేరుకుంది. వీరిలో ముగ్గురూ తమ ప్రతిభతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా విశేష ఆదాయం పొందుతున్నారు.
1982 డిసెంబర్ 3న జోధ్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్ చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించారు. ఇక అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మిథాలీ అగ్రస్థానంలో ఉన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, మెంటర్షిప్ పాత్రలు, మరియు క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇక స్మృతి మంధాన క్రికెట్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా తన ముద్ర వేసింది. ఆమెకు బీసీసీఐ గ్రేడ్ A కాంట్రాక్ట్ ద్వారా సంవత్సరానికి రూ.50 లక్షలు లభిస్తాయి. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఆమె రూ.3.4 కోట్లు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా హ్యుందాయ్, నైక్, రెడ్ బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నారు. ఇంకా ఆమె SM-18 స్పోర్ట్స్ కేఫ్, జిమ్, ప్రైవేట్ థియేటర్లను కూడా కలిగి ఉన్నారు.
NSEలో కొత్త మార్పు.. ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్లో ప్రీ-ఓపెన్ సెషన్.. వివరాలు ఇలా..!
ఇక ప్రపంచకప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విషయానికి వస్తే.. వరల్డ్ కప్ విజయం తర్వాత ఆమె బ్రాండ్ విలువ అమాంతం పెరిగనుంచి. ఆమెకు BCCI గ్రేడ్ A కాంట్రాక్ట్ ద్వారా 50 లక్షలు, WPLలో ముంబై ఇండియన్స్ తరఫున ప్రతి సీజన్‌కు రూ.1.8 కోట్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె పంజాబ్ పోలీస్‌లో DSPగా పనిచేస్తున్నారు. పుమా, CEAT, HDFC లైఫ్, బూస్ట్ వంటి ప్రముఖ బ్రాండ్లతో ఉన్న ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె ప్రతి సంవత్సరం రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నారు. పాటియాలా, ముంబై నగరాల్లో ఇళ్లతో పాటు లగ్జరీ కార్లు, బైక్‌ల సేకరణ కూడా ఆమె ఆస్తులలో భాగంగ ఉన్నాయి.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!