ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది.సినిమా టీజర్ వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైంది.టీజర్ తోనే తను తీస్తున్న సినిమా పై బాగా హైప్ ను పెంచేశారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. వ్యూహం సినిమా ఎవరి బయోపిక్ అయితే కాదూ.సీక్వెల్ అస్సలు కాదు అంటూ పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కొంత బయటపెట్టారు.. అస్సలు కుట్రలు ఎవరు చేశారు.ఆ కుట్రలకు ఎవరు బలయ్యారనేది మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ పెద్ద ట్విస్ట్ ను ఇచ్చారు ఆర్జీవి.అంతలోనే సీఎం జగన్‌ను రెండోసారి ఆర్జీవీ కలవడం హాట్ టాపిక్‌గా అయితే మారింది. ఇక వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాలను వేడెక్కించారు ఆర్జీవీ..ఈ సినిమా ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.
రీసెంట్ గా ఏపీ సీఎం జగన్‌ను మరోసారి కలిశారు రాంగోపాల్‌వర్మ. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఒక గంటపాటు సమావేశమయ్యారు. ఏపీ పాలిటిక్స్‌పై వర్మ తీస్తున్న వ్యూహం చిత్రంపై వీరిద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. 30శాతం చిత్రీకరణ పూర్తవ్వడంతో జగన్‌కు సీన్స్ ను కూడా చూపించారు వర్మ. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి నుంచి వర్మ స్పష్టత కూడా తీసుకున్నట్టు సమాచారం.కొన్ని సీన్స్ చిత్రీకరణ ఎలా ఉండాలనే విషయం పై సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా బయోపిక్ కాదు రియల్ సినిమా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వర్మకు సీఎం సూచించినట్టు సమాచారం.. సీఎం జగన్ బయోపిక్ గా జరుగుతోన్న ప్రచారాన్ని కూడా ఆపాలని గట్టిగా చెప్పారనే టాక్ కూడా వినిపిస్తున్నట్లు సమాచారం.సీఎంతో భేటీ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కూడా మాట్లాడారు ఆర్జీవీ. 30శాతం సినిమా కంప్లీట్ అయిందన్నారు.వివాదాలకు కేరాఫ్ నిలుస్తున్న ఆర్జీవీ. ఇంతకు ముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ అలాగే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు ఎంతటి కాంట్రవర్సీ ని సృష్టించాయో తెలిసిందే. కానీ వాటికన్నా మించి వ్యూహం సినిమా ఉండేలా చూస్తున్నట్లు సమాచారం.. మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. మొదటిది వ్యూహం అలాగే రెండోది శపథం పేరుతో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ స్టిల్స్‌ను వర్మ సోషల్ మీడియాలో విడుదల కూడా చేశారు
