NTV Telugu Site icon

RGV : డైరెక్టర్‌ ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

Rgv

Rgv

RGV : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌, ప్రముఖ డైరెక్టర్‌ ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. అన్ని పిటిషన్లపై నిన్న ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించిన వర్మ తరఫు న్యాయవాది.. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి మేరకు ఇవాళ విచారణ జరపనున్నారు న్యాయమూర్తి.. ఇవాళ వర్మకు ఊరట లభిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తాను ఎక్కడికి పారిపోలేదని షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నానని వీడియో విడుదల చేశారు వర్మ.. హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే ఆయన ఏం చేయబోతున్నారనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ.

Off The Record : మానుకోట మహాధర్నాలో BRS సంగతేంటి..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న దానిపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో వేరువేరుగా ఆర్జీవీపై పోలీస్‌ స్టేషన్లో కేసులు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఒంగోలులో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాలేదు. దీంతో ఏపీ పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు. ఆర్జీవీ తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ రేపటికి వాయిదా వేసింది. ఆర్జీవీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నిన్న రాత్రి ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. ‘నేను సంవత్సరం క్రితం ఏవో ట్వీట్స్ పెట్టాను అని అలిగేషన్. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు. ఇది అమెరికాలో యూరప్‌లో ఇక్కడ అదే జరుగుతుంది. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నా.’ అని వీడియోలో ఆర్జీవీ పేర్కొన్నారు.

Filmfare OTT : ఓటీటీ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఇదే..!