RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. ఓ చర్చా కార్యక్రమంలో తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ కంప్లైంట్ లో పేర్కొన్నారు. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్జీజీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ ఓ టీవీ షో డిబేట్ లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Read Also: Kriti Sanon: కృతి సనన్ ను టార్గెట్ చేసిన కేటుగాళ్లు ..డీప్ ఫేక్ వీడియో వైరల్..
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. టీవీ డిబేట్ లో కొలికపూడి నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు.. నన్ను చంపటానికి లైవ్ లో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు. కొలికపూడి అదే మాట మూడుసార్లు అన్నారు.. కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు.. అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది.. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు అని ఆయన పేర్కొన్నారు. లోకేష్, బాబు నిత్యం జగన్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు.. సినిమా అనేది విమర్శ కాదు.. వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతుంది.. వ్యూహం సినిమాతో టీడీపీ నేతలు గుమ్మడి కాయల దొంగ అంటే బుజాలు తడుముకుంటున్నా రు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.