Site icon NTV Telugu

RGV-Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. నెటిజన్స్ షాక్!

Rgv Chiranjeevi

Rgv Chiranjeevi

టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవికి దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు చిరు గారు అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ చిరుకి ఈరోజు ఆర్జీవీ ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే…

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున చేసిన సినిమా ‘శివ’. ఇండస్ట్రీని షేక్‌ చేసిన శివ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ అవుతుండడంతో స్టార్ హీరోస్ మహేశ్‌ బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌.. తదితరులు ఆల్‌ద బెస్ట్‌ చెప్తూ వీడియోలు పోస్ట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా పోస్ట్ చేశారు. ‘శివ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. సినిమా కాదు.. ఒక విప్లవం, ఒక ట్రెండ్‌ సెట్టర్‌. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి.. కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. ఇప్పటికీ సైకిల్‌ చైన్‌ సీన్‌ అందరి మనసుల్లో నిలిచిపోయింది. నాగార్జున నటనలోని తీవ్రత, శక్తి అద్భుతం. అమల, రఘువరన్‌.. సినిమాలోని ప్రతి ఒక్కరూ ఫ్రేమ్‌ ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు’ అని చిరు ప్రశంసించారు.

Also Read: Team India: భారత జట్టు వైపు దూసుకొస్తున్న ‘బారాముల్లా డెయిల్ స్టెయిన్’!

ఈ డిజిటల్ ఎరాలో శివ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి చాలా సంతోషించా. చక్కటి ప్రయత్నం. నేటి యువతరం ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. ఎప్పట్లోనే ఈ సినిమా ఎలా తీశారు అని అందరూ అనుకుంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సన వ్యక్తి రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన విజన్‌, కెమెరా యాంగిల్స్‌, లైట్స్‌, సౌండ్‌ ప్రజెంటేషన్‌ ఇలా అన్నీ కొత్తగా అనిపించాయి. ఆరోజే నాకు అనిపించింది.. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హ్యాట్సాఫ్‌ ఆర్జీవీ. తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్‌ ద బెస్ట్‌’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరు వీడియోపై స్పందించిన ఆర్జీవీ.. ధన్యవాదాలు చెబుతూ క్షమాపణలు కోరారు. అప్పట్లో ఆర్జీవీ-చిరు కాంబినేషన్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేశారు. 20 శాతం షూటింగ్‌ పూర్తయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య వైరం మొదలైందని అంటారు. సమయం దొరికినప్పుడల్లా చిరుపై వర్మ సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు మాత్రం బిన్నంగా క్షమాపణలు కోరారు.

Exit mobile version