NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమీక్ష..

Polavaram Project Diaphragm Wall

Polavaram Project Diaphragm Wall

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమీక్ష నిర్వహించనుంది.. పోలరవం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ టీ -16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రధాన డ్యామ్‌ పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన.. ఈ రోజు ఢిల్లీలో సమీక్ష సమావేశం జరగనుంది.. ఇక, ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే..

Read Also: Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. మరోసారి ట్రంప్ ప్రకటన