NTV Telugu Site icon

Revenue Employees Pen Down: ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్..

Pen Down

Pen Down

Revenue Employees Pen Down: విశాఖ రూరల్ ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకం రేపుతోంది.. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. ఎమ్మార్వో రమణయ్య హత్యకు దారితీసిన కారణాలను వెలుగులేకి తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే, రమణయ్య హత్య ఘటన రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.. దీంతో పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు రెవెన్యూ ఉద్యోగులు.. ఇవాళ్టి నుంచి రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఎమ్మార్వో హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది రెవెన్యూ అసోసియేషన్.. రమణయ్య హత్యపై రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో చర్చించిన ఉద్యోగులు.. ప్రభుత్వం స్పందించే వరకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుండి పెన్ డౌన్ చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఏమర్జెన్సీ కేసులు, పాత కేసులు తప్ప కొత్త వాటిని ప్రారంభించకూడదని ఉద్యోగులు నిర్ణయించారు. ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. రమణయ్య పిల్లలకు చదువు, రమణయ్య భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలని పేర్కొంది. ఇక, రమణయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌.

Read Also: Uttam Kumar Reddy: ఏపీకి 512.. టీఎస్‌ కి 299 టీఎంసీ ఎలా ఒప్పుకున్నారు? ఇది అన్యాయం కాదా?

Show comments