Site icon NTV Telugu

Big Breaking: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వారికి గన్ మెన్లు తొలగింపు..

Ts Govt

Ts Govt

తెలంగాణలో కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులను బదిలీ చేసింది. వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్ మెన్స్‌ను పోలీసు శాఖ విత్ డ్రా చేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్‌మెన్లను కేటాయించింది. ఎవరెవరికీ గన్ మెన్స్ అవసరమనే దానిపై ఇంటలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదిక తర్వాత వారి భద్రత కోసం గన్ మెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.

Exit mobile version