Site icon NTV Telugu

కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే : రేవంత్

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి… కేసీఆర్‌, మోడీ సర్కార్‌ లపై నిప్పులు చెరిగారు. ఇవాళ అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలేనని… పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డుగోలుగా పెరిగాయని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ ఆస్తులు అమ్ముతున్నారని… నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమన్నారు. మోదీ జాతి సంపదను ఆధాని, అంబానీలకు అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ఆధాని, అంబానీలు ఈ దేశమును స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించు కోవాలని.. హైదరాబాద్ చుట్టు పక్కల విలువైన భూములను కేసీఆర్ తన బంధువులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, దేశం పెను ప్రమాదం లో ఉందని…
మోడీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా కలసి పోరాడుదామని పిలుపునిచ్చారు. భారత్ బంద్ లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండాలన్నారు.

Exit mobile version