NTV Telugu Site icon

Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు

Revanth Reddy Fires

Revanth Reddy Fires

Revanthreddy : గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతికి రాష్ట్రానికి వారధిలా గవర్నర్ ఉంటారని ఆయన తెలిపారు. గవర్నర్ కి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇవ్వాల్సిందే అని సూచించారు. హైదరాబాదులో శాంతి భద్రతల బాధ్యత 2024వరకు గవర్నర్ కు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ఎంపీ లను హౌస్ అరెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదు. గవర్నర్ తన అధికారాలు ఉపయోగించడం లేదన్నారు. తమకు అన్యాయం జరిగినప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు గవర్నర్ కి ఈ ఇబ్బంది ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన చేసినప్పుడు… గవర్నర్ స్పందిస్తే బాగుండేది. ఇప్పుడు గవర్నర్ వరకు సమస్య వచ్చింది కాబట్టి అందరూ తనకు అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఇద్దరు తమిళనాడు నుండి వచ్చిన గవర్నర్లు.. kcr కాంగ్రెస్ ని చంపుతున్నాడు కదా అని వదిలేశారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నర్ లనే ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఇప్పుడు అర్థం అయ్యింది కేసీఆర్ గురించి గవర్నర్ లకు అంటూ ప్రసంగించాడు.

Read Also: Delhi: ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌కు వేధింపులు.. వీడియో వైరల్

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు. సీఎంలుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని ఆమె వాపోయారు. ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తెలంగాణలో ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని నిలదీశారు. ఈ విషయంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. గవర్నర్లపై ఎందుకింత చిన్నచూపన్నారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు.

Show comments