Site icon NTV Telugu

CM Revanth Reddy : ఆర్టీసీకి రూ.5,200 కోట్లు ఇచ్చాం.. ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో..!

Revanth Reddy Speech

Revanth Reddy Speech

CM Revanth Reddy : మహిళల శక్తిని ప్రేరణగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వీహబ్‌ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మహిళా స్టాళ్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడూ గౌరవిస్తుందని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. రూ.5,200 కోట్లను మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చామని, ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Ponnam Prabhakar : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనతవహించిందన్నారు. మన రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలంటే, మహిళలు ఆర్థికంగా స్వావలంబులవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించామని, మహిళా సంఘాలు, సొంత వ్యాపారాలు పెరిగేలా స్టార్టప్ మద్దతు ఇస్తున్నామని సీఎం రేవంత్‌ అన్నారు.

ఈ నెల 21న “ఇందిరా మహిళా స్టాళ్లను” మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నట్లు సీఎం వెల్లడించారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘‘కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇచ్చినప్పుడు వారు దేశం విడిచి వెళ్తున్నారు. కానీ మహిళలకు ఇచ్చే రూపాయికి విలువ ఉంది.. వారు సమర్థంగా వినియోగించి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారు,’’ అని చెప్పారు.

Pooja Hegde : దాని కోసం ఎక్స్‌ట్రా వర్కౌట్లు చేయకతప్పదు..

Exit mobile version