NTV Telugu Site icon

Resign: నేడు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..?

Regisn

Regisn

తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరన్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది. అయితే, రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేపు (గురువారం) చేయనున్నారు. రేవంత్ తో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం అందుతుంది.

Read Also: Sharat Marar : ది ఘోస్ట్ మూవీ తో మేము సేఫ్ అయ్యాము.. కానీ నాగార్జున లాస్ అయ్యారు..

అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యహ్నం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు వచ్చాక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నేతల్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో వీరు కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. వీరికి కూడా మంత్రివర్గంలో కీలక పదవులు వచ్చే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.