Site icon NTV Telugu

Revanth Reddy Tweet: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. తొలి పోస్ట్ ఇదే..!

Ts Cm

Ts Cm

తెలంగాణ కొత్త సీఎల్పీ నాయకుడిగా తనను ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు మద్ధతుగా నిలిచిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా పార్టీలో ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Shark Attack: పెళ్లైన తర్వాత రోజే షార్క్ దాడిలో నవ వధువు మృతి

అయితే, రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తారీఖున జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు ఠాక్రే, డీకే శివ కుమార్ లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించేందుకు ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Exit mobile version