Site icon NTV Telugu

ఈటల గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం : రేవంత్

హుజురాబాద్‌ ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని హెచ్చరించారు రేవంత్‌ రెడ్డి. కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అని… యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్ ను దగ్గరకు తీస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆరోపించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన ప్లైట్ కేసీఆరే అరెంజ్ చేశాడని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావేనని ఎద్దేవా చేశారు రేవంత్‌ రెడ్డి. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు.

Exit mobile version