Site icon NTV Telugu

Revanth Reddy: ఉచిత కరెంట్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

Revanthreddy

Revanthreddy

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో షబ్బీర్ అలీతో పాటు ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కరెంట్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. లేదంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటాను అని ఆయన తెలిపారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉంది.. లాగ్ బుక్ లు తీసుకుని కామారెడ్డికి రా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

Read Also: Bhatti Vikramarka: ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి.

కాంగ్రెస్ పార్టీ నిబద్దత మీద కామారెడ్డి చౌరస్తాలో నేను, షబ్బీర్ అలీ వస్తాం.. కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రిని తీసుకొనా వస్తావా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట్, సిరిసిల్లా, సూర్యాపేట్, కామారెడ్డి సబ్ స్టేషన్ లకు వెళ్లి చూద్దాం.. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను నా నామినేషన్లను ఉపసంహరించుకుంటాను అని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే కేసీఆర్.. కామారెడ్డి సాక్షిగా నీ ముక్కు నేలకు రాయాలి అని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చుంటే కేసీఆర్ నిరూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version