CM Revanth Reddy: రాహుల్ మాట ఇస్తే.. మట్టిలో కలిసినా మాట తప్పరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డు.. నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన చట్టం కాదు.. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. జయభేరి గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ పాలసీ ప్రారంభమైంది. తెలంగాణలో గిగ్ వర్కర్స్ సంక్షేమ పథకం అమల్లోకి రానుంది. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. 2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేదల కష్టాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారన్నారు. పాదయాత్రలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీని గిగ్ వర్కర్స్ కలిసి తమ సమస్యలను వివరించారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం చట్టం తీసుకువస్తామని రాహుల్ గాంధీ ఆనాడు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు.
ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ చట్టం ఈ రోజు అమలవుతుందని సీఎం రేవంత్రెడ్డి వివరించారు. “గిగ్ వర్కర్స్కు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. గిగ్ వర్కర్స్ బోర్డును ఏర్పాటు చేశాం. రాహుల్ గాంధీ మాట ఇస్తే సువర్ణాక్షరాలతో లిఖించినట్లే. రాహుల్ గాంధీ మాట మాకు ఆదేశం. ఈ చట్టం అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్స్కు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. గిగ్ వర్కర్స్ తరపున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నాం.” అని సభలో వ్యాఖ్యానించారు.

