Site icon NTV Telugu

Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అరుణ్‌ గోయల్‌ నియామకం

Election Commissioner

Election Commissioner

Election Commissioner: గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. దేశంలోని అత్యున్నత పోల్ బాడీలో మూడో పోస్టు దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అరుణ్‌ గోయల్‌ ఎన్నికల కమిషనర్‌గా నియామకమయ్యారని ఈ సాయంత్రం న్యాయ మంత్రిత్వ శాఖ నుంటి ప్రకటన వెలువడింది.

Delhi Liquor Scam: విజయ్‌ నాయర్, అభిషేక్‌ ఈడీ కస్టడీ పొడిగింపు.. రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు

1985 బ్యాచ్‌కి చెందిన పంజాబ్ క్యాడర్ అధికారి అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో పోల్ ప్యానెల్‌లో చేరనున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేయడంతో రాజీవ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. పోల్ ప్యానెల్ అప్పటి నుండి ఇద్దరు సభ్యుల సంఘంగా ఉంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లతో సహా అనేక కీలకమైన సమస్యలను ప్రస్తుతం పరిష్కరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల కమిషనర్‌గా ప్యానెల్‌లో సభ్యునిగా నియామకం కావడం గమనార్హం.

Exit mobile version