NTV Telugu Site icon

Professor Collapses On Stage : మాట్లాడుతూనే వేదికపై కుప్పకూలిన ప్రొఫెసర్.. అక్కడికక్కడే మృతి

Professor

Professor

Professor Collapses On Stage : అప్పటివరకు ఉత్సాహంగా ఓ వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్‌ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. బీహార్‌లోని చప్రా జిల్లాలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ మతపరమైన కార్యక్రమంలో వేదికపై కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. ప్రొఫెసర్ రణంజయ్ సింగ్, మతపరమైన కార్యక్రమం జరిగిన మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్డు ప్రొఫెసర్ వేదికపై మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Kishan Reddy: సూట్ కేసు నిండా డబ్బులు.. లారీల కొద్దీ బీర్లు

రణంజయ్‌ సింగ్ వేదికపై మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. హుటాహుటాన ఆస్పత్రి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు తెలిపారు. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తు్న్నారు.

Show comments