NTV Telugu Site icon

SLBC Tunnel: 25వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు

Slbc

Slbc

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌ 25వ రోజుకు చేరింది. రెస్క్యూకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టన్నెల్ లో రోబోలతో తవ్వకాలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Also Read:Hyderabad: షేక్ పేట్ లో ఓ ఇంట్లో భారీ చోరీ.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిన దొంగలు

అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు ఆటంకంగా మారాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టిబియం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమ వాళ్ల ఆచూకి ఇంకా లభించకపోవడంతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు.