Site icon NTV Telugu

SLBC Tragedy: 17వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు

Slbc

Slbc

SLBC Tragedy: శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన విషాద ఘటనతో 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. ఆదివారం నాడు డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి.

Read Also: MLC Nominations: ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుందా? నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు

ప్రస్తుతం డీ1, డీ3 ప్రాంతాల్లో 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇనుప ప్లేట్లు, రాడ్స్ అడ్డుగా ఉండటంతో ప్లాస్మా కట్టర్ల సాయంతో వాటిని కత్తిరిస్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు.

Exit mobile version