Republic Day 2025 : 2025 రిపబ్లిక్ డే సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు సంబంధించిన మొత్తం 942 మంది సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో గౌరవించింది. వీరిలో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి గ్యాలంట్రీ పతకాలు, అలాగే 2 మందికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అందజేశారు. గ్యాలంట్రీ అవార్డుల్లో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించిన సిబ్బందికి కేటాయించబడ్డాయి.
తెలంగాణలో ఉత్తమ సేవలు అందించి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నది వీరే
హైదరాబాద్ లా అండ్ అర్డర్ అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ కు ప్రెసిడెంట్ మెడల్
ఎస్పీ మాణిక్య రాజ్ కు ప్రెసిడెంట్ మెడల్
మరో 12 మందికి విశిష్ట సేవా పతకాలు
ఐజీ కార్తికేయ, ఎస్పీ లు ముత్యం రెడ్డి, కమల్ల రామ్ కుమార్, ఫజ్లుర్ రెహమాన్ లకు విశిష్ట సేవా పతకాలు.. డీఎస్పీలు కొటపాటి వెంకట రమణ, అన్ను వేణుగోపాల్ లకు విశిష్ట సేవా పతకాలు.. ఇన్పెక్టర్ నిరంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు పాత్య నాయక్, అయూబ్ ఖాన్ లకు విశిష్ట సేవా పతకాలు.. ఏఎస్సై లు రన్‌వీర్ సింగ్, ఠాకూర్, జోసెఫ్ బహదూర్, మోయినుల్లాఖాన్ లకు విశిష్ట సేవా పతకాలు.. మరో ముగ్గురు ఫైర్ అధికారులకు, నలుగురు హోం గార్డులకు విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు.
Hydra: హైడ్రా చర్యలకు హర్షం వ్యక్తం చేసిన దివ్యానగర్ వాసులు.. ఎందుకంటే?