Site icon NTV Telugu

Indian Railways: సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరణ.. కొనసాగుతున్న రైళ్ల రాకపోకలు

Trains

Trains

కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ర్వైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరించారు. తలమాడ్ల వద్ద ట్రాక్ మరమ్మత్తులు పూర్తయ్యాయి. మరమ్మత్తులు పూర్తి కావటంతో యాదావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళ్లింది. 36 గంటలపాటు కొనసాగిన మరమ్మతు పనులు.. మొదట డెమో ట్రైన్ తో ట్రాక్ చెక్ చేసిన రైల్వే అధికారులు.. ఒక్క రైలును నిజామాబాద్ వరకు పంపిన అధికారులు.. నిజమాబాద్ – నాందేడ్ మధ్య రైళ్లు రద్దయ్యాయి.

Exit mobile version