NTV Telugu Site icon

Hinduja Group: హిందూజా కుటుంబానికి ఊరట.. మానవ అక్రమ రవాణా కేసులో నిర్దోషులుగా ప్రకటన

New Project (3)

New Project (3)

హిందూజా కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలపై హిందుజా కుటుంబానికి చెందిన నలుగురికి జూన్ 21న స్విస్ కోర్టు శిక్ష విధించింది. కానీ ఒక రోజు తర్వాత ఉన్నత న్యాయస్థానం వారిపై అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు. తమకు తెలియకుండా తప్పుడు సంతకాలు చేసి కేసు బనాయించారని కోర్టుకు వారు తెలిపారు. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన హిందూజా కుటుంబానికి భారత్‌తోనూ సంబంధాలు ఉన్నాయి.

READ MORE: NEET: నీట్‌పై సోమవారం ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ!

హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై మోపిన అత్యంత తీవ్రమైన అభియోగం మానవ అక్రమ రవాణాను నిన్న కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారులు ఎవరూ లేరని, తమకు అర్థం కాని పత్రాలపై సంతకం చేశారని ఈ ఫిర్యాదుదారులు కోర్టులో తెలిపారు. హిందూజా కుటుంబ సభ్యులు తమతో “గౌరవంతో.. కుటుంబంలాగా” వ్యవహరించారని వారందరూ మరింత సాక్ష్యమిచ్చారు.

READ MORE: Pawan Kalyan: రేపు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

కాగా.. బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబానికి ఇటీవల షాక్‌ తగిలింది. స్విట్జర్లాండ్‌ జెనీవాలోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమదోపిడీకి పాల్పడ్డారనే కేసులో ఆ కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశ్‌ హిందుజా, ఆయన సతీమణి కమల్‌కు నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు నాలుగేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. తీర్పు సమయంలో వారెవరూ కోర్టులో లేరు. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్‌ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్‌ శిక్ష విధించింది. దీంతో ఆ కుటుంబం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. వారందరినీ నిర్దోషులగా ఉన్నత న్యాయస్థానం తేల్చింది.