Site icon NTV Telugu

టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ విడుదల!

Exams

ఇవాళ తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్‌ క్యాలెండర్‌ ను రిలీజ్‌ చేసింది. అకాడమిక్‌ క్యాలెండర్‌ ను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉంటాయన్నారు. 47 రోజులు ఆన్టైన్‌ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్‌ డే ఏప్రిల్‌ 23 అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో 10 వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు మళ్లీ వేసవి కాలం సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే దసరా సెలవులు అక్టోబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 17 వరకు ఉంటాయన్నారు.

Exit mobile version