NTV Telugu Site icon

Relationship Tips : ఈ లక్షణాలు ఉన్న వారిని నమ్మకండి

Relatioship Tips

Relatioship Tips

Relationship Tips : మనం ఎంత పెద్ద కుటుంబం మధ్య పెరిగిన మనకంటూ కొంత మంది స్నేహితులు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీతో పంచుకోలేని విషయాలు మనసు తేలిక కోసం స్నేహితులతో చెప్పుకుంటాం. కానీ ఏ బంధానికైనా నమ్మకం అనేది పునాది. నమ్మకం ఉంటేనే బంధం నిలబడుతుంది. ఎవరితోనైనా మన భావాలు, సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నామంటే వారి మీద ఉన్న నమ్మకమే. కాని కొంత మంది మన విషయాలు తెలుసుకుని అవి ఇతరులతో పంచుకుంటు కాలక్షేపం చేస్తారు. అలాంటివి జరిగినప్పుడు చాలా బధ కలుగుతుంది. కనున మనం ఎలాంటి స్నేహితులను ఎంచుకుంటున్నాం, మన చూట్టు ఎలాంటి మనుషులు ఉన్నారు, వారి స్వభావం ఏంటి అనేది తెలుసుకోగలగాలి మరి అది ఎలా అనేది చూద్దా.

* ముక్కుసూటిగా ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు చాలా నిజాయితీగా ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు మీ స్నేహితులో కానీ, బందువులల్లో కానీ ఉంటే వారిని వదులుకోకండి. మీరు తప్పు దారి పడుతుంటేగనుక వారు గుర్తిస్తారు. మంచి చెడు చెబుతారు. ఇలాంటి వారిని నమ్మడం లో తప్పులేదు.

* కానీ కొంత మంది తియ్యగా మాట్లాడి మీ నమ్మకాన్ని గెలుచుకి, అనవసర సమయాల్లో కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ మీ బలహీనతల్ని తెలుసుకుంటారు. ఇలాంటి వారు గొడవ జరిగినప్పుడు వారి ముసుగు తొలగిస్తారు. ఇతరులకు మీ సీక్రెట్‌లు చెప్పి, మీ వీక్ పాంయింట్ తో ఆడుకోవాలని చూస్తారు. కాబట్టి మన చుట్టూ ఉంటూ భజన చేసే వారిని నమ్మకండి.

*నాకు వారు తెలుసు, వీలు తెలుసు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన నేను చూసుకుంటా అని చెప్పి, సమయానికి మాత్రం చేతులేత్తేసే వారు కూడా ఉంటారు జాగ్రత. ఇలాంటి వ్యక్తులను అసలు సమ్మడానికి లేదు. వీరిని నమ్మె కొద్ది మోసం చేస్తుంటారు. ఇలాంటి వారు మాటమీద నిలకడగా ఉండరు అందుకే పొరపాటున కూడా ఇలాంటి వ్యక్తులకు నమ్మకండి, మీ సీక్రెట్స్ చెప్పకండి.

* నోట్లో మాట ఆగక, ఎప్పుడు ఎదో ఒకటి వాగుతూ ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పుకుంటు టైం పాస్ చేస్తుంటారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు వారి వాగుడు కారణంగా ఇబ్బందుల్లో పడతారు, ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడతారు. వాలకి మీ సీక్రెట్స్ చెబితే అంతే సంగతి, సిక్రెట్ లు కాస్తా ఓపెన్ సీక్రెట్స్‌గా మారిపోతాయి. కనుక ఇలాంటి వాలకి ధూరంగా ఉండాలి.

* సంబంధం లేని విషయంలో దూరి మ్యాటర్ తెలుసుకోవడానికి ఆరాటం పడెవాలు ఉంటారు. పొరపాటున వీళ్ళతో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాము అంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తారు. ఎదుటి వారి బాధను అర్థం చేసుకునే స్వభావం వారిలో తక్కువగా ఉంటుంది.

* మంచి మనసు ఉన్న వారు తొందరగా బాధ పడతారు, చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకుంటారు ఇలాంటి వారిని వదులుకోకండి. ఎందుకంటే వారికి మోసం చేయడం రాదు.

Antony Blinken: గ్రీన్‌ల్యాండ్‌ విలీనం జరిగే ఛాన్స్ లేదు.. ట్రంప్‌ మాటలు పట్టించుకోవద్దు..!

Show comments