యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన తారాగణంగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. దీనికి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాత. ఈ సినిమా రెండు పాటల మినహా పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఆ రెండు పాటలను కశ్మీర్ లో చిత్రీకరించబోతున్నారు. వీటి షూటింగ్ నిమిత్తం యూనిట్ కశ్మీర్ వెళుతున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెంరెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్ , దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… ”ఇది కామెడీ తో కూడుకున్నహారర్ సినిమా. ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఈ సినిమా అందరూ చాలా డెడికేటెడ్ గా చేశాం. ఇందులో హీరోలుగా యస్వంత్ , జబర్దస్త్ రాకేష్ నటించారు. నటి సత్య కృష్ణ కూతురు అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. అత్యధిక భాగం షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరిపాం. కశ్మీర్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చే నెలాఖరులో మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.
చిత్ర నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ”ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు ఎలా చరిత్ర సృష్టించాయో ఇప్పుడు వస్తున్న ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ కూడా చరిత్ర సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గతం లో 76 సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. డీఓపీ శంకర్, ఎడిటర్ వెలగపూడి రామారావు, చీఫ్ కో డైరెక్టర్ రామారావు కూరపాటి, సంగీత దర్శకుడు రఘు కుంచె అందరూ కమిట్ మెంట్ తో వర్క్ చేశారు” అని అన్నారు.
