NTV Telugu Site icon

Regina Cassandra : రెజీనా పేరు వెనుక ఇంత కథ ఉందా.. రెండు మతాల పేర్లు పెట్టుకోవడానికి కారణం ఇదా ?

Regina Cassandra

Regina Cassandra

Regina Cassandra : రెజీనా ఈ పేరుతో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సుధీర్ బాబు హీరోగా పరిచయం అయిన ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్ర. ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో ఫుల్ స్వింగులో సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత యంగ్‌ హీరోలు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా పేరు సొంత చేసుకుంది. ఆ సమయంలో మెగా హీరోలతో పాటు పలువురు యంగ్‌ హీరోలతో తను చేసిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. దాంతో మరిన్ని ఆఫర్లు ఈమెకు వచ్చాయి. కానీ గత కొన్నాళ్లుగా ఈమె పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. అయితే తమిళ్‌, హిందీ సినిమాల్లో ఈమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2012లో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ అమ్మడు దాదాపు దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్థాయిలో ఈ అమ్మడు సైతం టాలీవుడ్‌ టాప్ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలు హిట్‌ అయినా స్టార్‌ హీరోల దృష్టి ఈ అమ్మడిపై పడలేదు. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ దక్కలేదు. తెలుగులో ఈమె మళ్లీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు వెనుక ఉన్న కథ గురించి వెల్లడించింది. రెండు మతాలకు సంబంధించిన తన పేరు వెనుక ఉన్న స్టోరీ గురించి చెప్పి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.

Read Also:ISRO: 2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం: ఇస్రో చైర్మన్

రెజీనా కసాండ్ర మాట్లాడుతూ… మా అమ్మ, నాన్నలది లవ్ మ్యారేజ్. అమ్మ క్రిస్టియన్‌ కాగా నాన్న ముస్లిం. వారు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ ముస్లిం మతాన్ని స్వీకరించింది. నేను పుట్టిన తర్వాత నాకు ముస్లిం పేరు అయిన రెజీనా అని పెట్టారు. నాకు ఆరు ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మా నాన్న విడిపోయారు. దాంతో అమ్మ తిరిగి క్రిస్టియన్‌ మతాన్ని స్వీకరించింది. అప్పుడు నా పేరుకు కసాండ్రను జోడించింది. అలా ముస్లిం మతం ప్రకారం రెజీనా కాగా, క్రిస్టియన్‌ పేరు కసాండ్ర నా పేరుకు కలిసింది. అలా నేను రెజీనా కసాండ్ర అయ్యానంటూ చెప్పుకొచ్చింది. తాను రెండు మతాలను గౌరవిస్తాను అంటూ రెజీనా పేర్కొంది. ప్రస్తుతం తమిళ్‌, హిందీలో కలిపి మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. హిందీ ప్రేక్షకులను మెప్పించేందుకు ఈమె చాలా ప్రయత్నాలే చేస్తుంది. త్వరలోనే వెబ్‌ సిరీస్‌ ద్వారా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Read Also:Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?

Show comments