ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో ఈ అమ్మడుకు ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది.. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు మరో డైరెక్టర్ ఆ సినిమాను తెరకేక్కించనున్నారు..
ఇక ఈ సినిమాలో నటి త్రిష, బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్‌గా అర్జున్ దాస్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో అర్జున్ దాస్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు..ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్ అజర్‌బైజాన్ దేశంలో ప్రారంభమైంది.. ఆ తర్వాత షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది.. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు..