NTV Telugu Site icon

Rega Kanta Rao : ⁠ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టం

Rega

Rega

సోషల్ మీడియా వేదిక రేగా కాంతారావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ⁠ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టమన్నారు రేగా కాంతా రావు. ⁠కానీ రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు తప్పదని, ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పరిస్థితులు సంభవిస్తాయో అని ప్రజల్లో చర్చ ఉందన్నారు. ⁠ఖమ్మం, నల్గొండ మానవ బాంబులతో ప్రమాదం ఉంది ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు రేగా కాంతా రావు. ⁠యావత్ రాష్ట్ర ప్రజలు కెసిఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు చిన్న కోపం వచ్చింది ఇంత ప్రమాదం జరుగుద్దని ప్రజలు ఊహించలేదని, ⁠ఎంపీ ఎన్నికల్లో కార్ రిపేర్ అయ్యి దూకుడు పెంచింది కాంగ్రెస్ అనుకునే 14 సీట్లు కార్ ఖాతా లోనే పడతాయన్నారు రేగా కాంతా రావు.

 

⁠రేవంత్ కు భంగపాటు తప్పదు ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారు రేగా కాంతా రావు. రుణమాఫీ అయినోళ్లంతా బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోవాలని, డిసెంబర్‌ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పిందని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక గంట కూడా కరెంట్ కోతలు లేవని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు కరువు రాష్ట్రంలో తాండవిస్తోందని ఆయన విమర్శించారు. రోజురోజుకు నీటి సమస్య పెద్దగా మారుతోందని, పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వంకు చెవికి ఎక్కడం లేదన్నారు రేగా కాంతారావు.