Site icon NTV Telugu

Redmi Pad 2 Pro 5G: రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్‌ రిలీజ్.. 12,000mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?

Redmi Pad 2 Pro 5g

Redmi Pad 2 Pro 5g

Redmi కొత్త రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్‌ ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 12,000mAh బ్యాటరీతో వస్తుంది. 12.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. Redmi Pad 2 Pro 5G 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi-మాత్రమే వేరియంట్ ధర రూ.22,999 నుండి ప్రారంభమవుతుంది. Wi-Fi + 5G వేరియంట్ ధర రూ.25,999. 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన Wi-Fi + 5G మోడల్ ధర రూ.27,999. యాక్సిస్ బ్యాంక్, SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే ఈ టాబ్లెట్‌పై కంపెనీ రూ.2,000 వరకు తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ టాబ్లెట్ జనవరి 12న Xiaomi ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. మీరు సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్‌లలో టాబ్లెట్‌ను కొనుగోలు చేయొచ్చు.

Also Read:CES 2026: 10 నిమిషాల ఛార్జింగ్‌తో 300KM రేంజ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి సాలిడ్-స్టేట్ బ్యాటరీ బైక్ ఆవిష్కరణ

Redmi Pad 2 Pro ఫీచర్లు

Redmi Pad 2 Pro అనేది 12.1-అంగుళాల 2.8K డిస్‌ప్లేను కలిగి ఉన్న శక్తివంతమైన బడ్జెట్-ఫ్రెండ్టీ టాబ్లెట్. ఈ టాబ్లెట్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 600 nits వరకు బ్రైట్ నెస్ కలిగి ఉంది. పనితీరు కోసం, టాబ్లెట్ Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. కనెక్టివిటీ కోసం, టాబ్లెట్ 5G, eSIM టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రత్యేకమైన కీబోర్డ్, స్మార్ట్ పెన్, ప్రొటెక్షణ్ కవర్‌ను కూడా విడుదల చేసింది.

Exit mobile version