Redmi Note 13 Pro+ Price and Specifications: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరి 4న భారత్‌లో విడుదలైంది. రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్‌లను కంపెనీ రిలీజ్ చేసింది. నోట్ 13 ప్రో ప్లస్ ఈ సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్. షావోమీ తీసుకొచ్చిన ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లు ఓసారి చూద్దాం.
Redmi Note 13 Series Price:
రెడ్‌మీ నోట్ 13 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, ప్రిజమ్ గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.25,999గా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది.ఇక 12 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ వేరియంట్ అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.31,999, 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.33,999, 12జీబీ+512 జీబీ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది.
Redmi Note 13 Specifications:
రెడ్‌మీ నోట్ 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్‌సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్.. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
Redmi Note 13 Pro And Redmi Note 13 Pro+ Specifications:
ఈ రెండు మోడల్స్ 6.67 అంగుళాల అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. 1.5K రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. రెడ్‌మీ నోట్ 13 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉండగా.. ప్రో+లో డైమెన్‌సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. రెండు మోడళ్లోనూ 200 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. రెడ్‌మీ నోట్ 13 ప్రోలో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్.. రెడ్‌మీ నోట్ 13 ప్రో+లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
Also Read: Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్‌కు సైతం సాధ్యం కాలే!
Redmi Note 13 Offers:
రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ జనవరి 10 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ఔట్‌లెట్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే.. రెడ్‌మీ నోట్ 13పై బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజీ బోనస్ కింద రూ.1000, ప్రో మోడళ్లపై రూ.2000 లభిస్తుంది.