NTV Telugu Site icon

Redmi Note 13 Pro Launch: వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన రెడ్‌మీ.. 200ఎంపీ కెమెరా, 5120 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Redmi Note 13 Pro Plus

Redmi Note 13 Pro Plus

Redmi Note 13 Pro Plus Smartphone Launch in China: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్‌ సిరీస్‌ 13ను చైనాలో విడుదల చేసింది. నోట్ 13 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రో మరియు ప్రో ప్లస్ వేరియంట్‌లు ఉన్నాయి. నోట్ 13 ప్రో ప్లస్ 13 సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్. ఇది మిగతా వాటి కంటే అద్భుత అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. 13 సిరీస్ భారత్‌లో త్వరలోనే రానుంది. 13 సిరీస్‌తో పాటు కొత్త టాబ్లెట్ మరియు టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌లను కూడా రెడ్‌మీ విడుదల చేసింది. నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్ల వివరాలను ఓసారి చూద్దాం.

Redmi Note 13 Pro Plus Specs:
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ సబ్-బ్రాండ్ నోట్ లైనప్‌కి ఒక అప్‌గ్రేడ్. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించే కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. నోట్ ఫ్యామిలీలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. బ్యాక్ ప్యానెల్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో ఫాక్స్ లెదర్ ఆకృతిని కలిగి ఉంది. ఇది ఆకర్షణీయమైన మరియు ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. ఈ ఫోన్ IP68-సర్టిఫైడ్ కాబట్టి ఇది దుమ్ము మరియు నీరు పడినా ఏమి కాదు. ఇది వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌.

Redmi Note 13 Pro Plus Camera:
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన కెమెరాతో వస్తుంది. ఇది 200ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోటోలు మరియు వీడియోలను అద్భుతంగా తీయగలదు. 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2MP థర్డ్ షూటర్‌ను కూడా ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ OIS మరియు EISకి మద్దతు ఇస్తుంది. ఇది ఇన్-సెన్సర్ జూమ్ మరియు 4x ఆప్టికల్ లాస్‌లెస్ జూమ్‌తో మూడు వేర్వేరు ఫోకల్ లెంగ్త్‌లలో షూట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Redmi Note 13 Pro Plus Battery:
నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది. 5120mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక రోజు కంటే ఎక్కువ రన్ టైమ్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 16GB RAM మరియు 512GB వేరియెంట్ అందుబాటులో ఉంటుంది. దాంతో భారీ సంఖ్యలో యాప్‌లు మరియు గేమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Also Read: iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

Redmi Note 13 Pro Plus Price:
రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB ధర CNY 1,999 (భారత కరెన్సీలో దాదాపుగా రూ. 22,697)గా ఉంది. 12GB + 512GB మరియు 16GB + 512GB కాన్ఫిగరేషన్‌ల ధర వరుసగా CNY 2,199 (రూ. 24,947) మరియు CNY 2,299 (రూ. 26,111)గ ఉంది. సెప్టెంబర్ 26 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.