Site icon NTV Telugu

డాల్బీ విజన్ సపోర్ట్, OLED డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీతో Redmi K90 Ultra

K90

K90

Redmi K90 Ultra: షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ అక్టోబర్ 2025లో చైనాలో Redmi K90 Pro Maxను, Redmi K90తో కలిసి విడుదల చేసింది. Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం K90 సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. అయితే, త్వరలోనే ఆ స్థానాన్ని కొత్త మోడల్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో మరో కొత్త ఫోన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది Redmi K90 Ultraగా మార్కెట్‌లోకి రానుందని అంచనా. ఈ ఫోన్, గత మోడల్‌తో పోలిస్తే కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్స్ తో రాబోతుందన్నారు. తాజాగా దీనికి సంబంధించిన చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: స్క్వేర్ సెన్సార్ సెల్ఫీ కెమెరా.. యాపిల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న Oppo Find X10, హువావే

Redmi K90 Ultra స్పెసిఫికేషన్లు:
రెడ్మీ K90 Ultraలో MediaTek Dimensity 9500 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. ఇది హైఎండ్ పని తీరు, గేమింగ్ కోసం రూపొందించిన శక్తివంతమైన ప్రాసెసర్‌గా భావిస్తున్నారు.

* 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* “అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్” డిస్‌ప్లే
* గేమింగ్ సమయంలో వేడి నియంత్రణ కోసం యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్

10,000mAh బ్యాటరీ?:
Redmi K90 Ultraలో 8,500mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తుంది. ఇది ముందుగా వినిపించిన 10,000mAh బ్యాటరీ ఉండే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ, భారీ బ్యాటరీతో దీర్ఘకాలిక బ్యాకప్ అందించే అవకాశం ఉంది.

Read Also: IND vs PAK: ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు.. భారత్తో మ్యాచ్పై పాక్ యూ టర్న్.. ఆ రోజే తెలుస్తుంది!

డిస్‌ప్లే, కెమెరాలో అప్‌గ్రేడ్స్:
కెమెరా విభాగంలో ఈ ఫోన్ గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించనుందని తెలుస్తుంది.
* LTPS OLED ప్యానెల్
* 6.81 అంగుళాల నుంచి 6.89 అంగుళాల మధ్య స్క్రీన్ సైజ్

Redmi K90 Pro Max ధర:
గతంలో లాంచ్ అయిన Redmi K90 Pro Max చైనాలో CNY 3,999 (భారత కరెన్సీలో సుమారు రూ. 49,000) ప్రారంభ ధరతో విడుదలైంది. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.

స్పెసిఫికేషన్లు:
* 6.9 అంగుళాల OLED డిస్‌ప్లే (1200×2608 పిక్సెల్స్)
* 120Hz రిఫ్రెష్ రేట్
* 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్
* Snapdragon 8 Elite Gen 5 (3nm) చిప్‌సెట్
16GB LPDDR5x RAM, 1TB UFS 4.1 స్టోరేజ్

Exit mobile version