NTV Telugu Site icon

Redmi 13 5G Price: భారత్‌ మార్కెట్‌లోకి రెడ్‌మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్‌!

Redmi 13 5g Price

Redmi 13 5g Price

Redmi 13 5G Launch Date in India and Price: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘షావోమి’.. రెడ్‌మీ బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్‌మీ 13 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ మంగళవారం భారత్‌లో విడుదలైంది. ఇది సరికొత్త ఎంట్రీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్రిస్టల్‌ గ్లాస్‌ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్‌ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. షావోమి హైపర్‌ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్‌ ఇదే కావడం విశేషం. డిజైన్‌ విషయంలో రెడ్‌మీ12 5జీని ఈ ఫోన్ పోలి ఉంది. రెడ్‌మీ 13 5జీ ధర, ఫీచర్స్ వివరాలను ఓసారి చూద్దాం.

Redmi 13 5G Price
రెడ్‌మీ 13 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియెంట్ ధర రూ.12,999 కాగా.. 8 జీబీ+128జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999గా ఉంది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. రెడ్‌మీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

Redmi 13 5G Specifications:
రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.79 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంటుంది. డ్యూయల్‌ గ్లాస్‌ డిజైన్‌తో ఇది వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ పని చేస్తుంది. నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది. హవైన్‌ బ్లూ, ఆర్కిడ్‌ పింక్‌, బ్లాక్‌ డైమండ్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Also Read: Gautam Gambhir Salary: గౌతమ్ గంభీర్ జీతం ఎంతో తెలుసా?

Redmi 13 5G Camera and Battery:
రెడ్‌మీ 13 5జీలో 108 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13 ఎంపీ కెమెరా ఉంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా పక్కనున్న రింగ్‌ ఫ్లాష్‌ రెడ్‌మీ 13 5జీ ఫోన్‌ ప్రత్యేకత. ఫొటో తీసేటప్పుడే కాకుండా.. కాల్స్‌, నోటిఫికేషన్స్‌ సమయంలోనూ ఇది ఫ్లాష్‌ అవుతుంది.

Show comments