Site icon NTV Telugu

Soldier: జవాన్ కు ఘనంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు… వీడియో వైరల్

Soli

Soli

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనో లేదా బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనో కోరుకుంటారు. మరికొంతమంది ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ పిల్లలు హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డ సైన్యంలో చేరి భరతమాత రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. దేశమాత కోసం ఎంతో మంది వీర పుత్రులను త్యాగం చేసిన గడ్డగా పంజాబ్ కు పేరుంది.

మన సైన్యంలో ఉన్నవారిలో ఎక్కువ మంది పంజాబ్ కు చెందిన వారే ఉంటారు. ఆర్మీలో కూడా పంజాబీల కోసం ప్రత్యేకంగా ఒక రెజిమెంట్ కూడా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో పనిచేస్తూ జవాన్ సెలవుల మీద ఇంటికి వస్తే అందరూ ప్రత్యేకంగానే చూస్తారు. అయితే పంజాబ్ లోనే ఒక కుటుంబం ఆర్మీలో పనిచేస్తూ సెలవు మీద ఇంటికొచ్చిన యువకుడికి ఘనంగా స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్రామానికి దగ్గరలో ఉన్న పొలాల్లో యువ జవాన్ ఇళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడికి అతను కారులో నుంచి దిగుతాడు.

Also Read: Independence Day: సముద్రం లోపల జాతీయ జెండా .. వీడియో వైరల్

అతను కారు దిగగానే కొందరు వచ్చి అతడిని ఆలింగనం చేసుకుంటాడు. కొంచెం ముందుకు వెళ్లగానే అతను ఆగిన చోటు నుంచి ఇంటి ముందు వరకు రెడ్ కార్పెట్ పరచి ఉంటుంది. దాని మీద కవాతూ చేస్తూ ఇంటి గేటు వరకు నడుచుకుంటూ వెళ్తాడు ఆ జవాన్. ఇంటి గేటు ముందు వెల్ కమ్ బ్యాక్ అని రాసి ఉంటుంది. ఇక వారి కుటుంబ సభ్యులను చేరుకోగానే ఆ జవాన్ వారికి సెల్యూట్ చేసి ఆశీర్వదాలు తీసుకుంటాడు.

వారు కూడా ఎంతో భావోద్వేగంతో అతని పై పూలు చల్లుతూ స్వీట్స్ తినిపిస్తూ స్వాగతం చెబుతారు. తమ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ జవాన్ సెల్యూట్ చేస్తుంటే వారు కూడా అతనికి తిరిగి సెల్యూట్ చేస్తూ ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. జవాన్ రాకతో అక్కడ వారి సంబరాలకు అంతులేకుండా పోయింది. అక్కడంతా కోలాహలం నెలకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక జవాన్ కు చెప్పాల్సిన వెల్ కమ్ ఇలానే ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.

 

 

Exit mobile version