Site icon NTV Telugu

Red Alert for Uttar Andhra: ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దబిడిదిబిడే

Rain

Rain

Red Alert for Uttar Andhra: ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాలో కుండపోత వాన కురిసే అవకాశం ఉంది. ఇవాళ (అక్టోబర్ 5న) తెల్లవారుజాము నుంచే ఎడతెరపి లేని వర్షం కురవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

Read Also: Delhi: విదేశీ కోచ్‌లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్

అయితే, తమిళనాడు తీరం వెంట బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, ఈ మూడు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలానే, అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని.. తీర ప్రాంత ప్రజలు అలర్టుగా ఉండాలి, వర్షం పడే సమయంలో బయటకు రావద్దని ఐఎండీ సూచించింది.

Exit mobile version