NTV Telugu Site icon

Red Alert: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..

Shamshabad Airport

Shamshabad Airport

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్ పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు అధికారులు.. అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.