తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజిత్.. తన కెరీర్లోని 63వ చిత్రం కోసం ఒక యంగ్ డైరెక్టర్తో చేతులు కలపనున్నారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరాకెక్కిస్తున్నారు.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు.. ఈ సినిమాకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు..
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ పోస్టర్ తో పాటు సినిమా రెగ్యులర్ షూట్ అలా వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ భారీ వ్యూస్ ను రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది.. ఇప్పటివరకు ఈ పోస్టర్ కు 27.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.. కేవలం పోస్టర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక సినిమా బ్లాక్ బాస్టరే అంటూ అజిత్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
ప్రస్తుతం అజిత్ ‘విడా ముయర్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూట్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు అజిత్.. ఈ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విశాల్ తో ‘మార్క్ ఆంటోనీ’సినిమాను తెరాకెక్కించారు.. దాంతో అజిత్ సినిమా పై అంచనాలు పెరిగాయి.. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..
