Site icon NTV Telugu

Rebels of Thupakula Gudem : ఓటీటీలోకి వచ్చేస్తున్న నక్సలిజం బ్యాక్‌డ్రాప్ తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 05 At 3.24.45 Pm

Whatsapp Image 2024 02 05 At 3.24.45 Pm

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తెలుగు మూవీ “రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం “2023 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి జైదీప్ విష్ణు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్‌, జయేత్రి మరియు వినీత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్స్‌ మరియు ట్రైలర్స్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. తుపాకుల గూడెం అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ ఈ కథ సాగుతుంది. నక్సలిజం సమస్యను రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకువస్తుంది. లొంగిపోయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ జాబ్ ఇస్తామని ప్రకటిస్తుంది. తన ప్రేమ కోసం కుమార్ నక్సలైట్‌గా వేషం మార్చి పోలీసులకు లొంగిపోయే ప్రయత్నం చేస్తాడు..కానీ శివన్న అనే నక్సలైట్ లీడర్ వల్ల అతడి ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది..ఇంతకీ శివన్న ఏం చేశాడు.. మమతతో కుమార్ ప్రేమాయణం సక్సెస్ అయ్యిందా.. నక్సలైట్లతో గొడవ పడిన క్రాంతి ఎవరు..18 ఏళ్ల క్రితం మాయమైన అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు.. అన్నదే రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం మూవీ కథ.

ఈ సినిమాలో కనీస సదుపాయాలు లేక గిరిజన ప్రాంతాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి..ఉద్యోగాల పేరుతో కొండ ప్రాంతాల ప్రజల్ని కొందరు బ్రోకర్స్ ఎలా మోసం చేస్తున్నారన్నది దర్శకుడు జైదీప్ సందేశాత్మకంగా  చూపించాడు.రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు.మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్నా సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో విజయం సాధించలేకపోయింది. అదే టైమ్‌లో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో విరాటపర్వం మరియు సింధూరం లాంటి సినిమాలు రావడం కూడా రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమాకు మైనస్ అయ్యింది.ఈ సినిమాకు శ్రీకాంత్ అర్పుల సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో నటించిన అందరూ కొత్త నటీనటులే అయినా అద్భుతమైన నటనను కనబరిచారు.అయితే ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఏడాదికి ఓటీటీలోకి వస్తుంది.రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఇటీవల అనౌన్స్‌చేసింది.ఫిబ్రవరి 8 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

Exit mobile version