రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Rukmini Vasanth : హిట్ కొట్టిన రుక్మిణి వసంత్.. ఊపిరిపీల్చుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
త్వరలోనే మరొక ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజాసాబ్ రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు దాదాపు 3. 15 గంటల రన్ టైమ్ తో ఫైనల్ కాపీ రెడీ అయినట్టు సమాచారం. అయితే ఈ రన్ టైమ్ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ను కాస్త బయపెడుతోంది. మూడు గంటలకు పైగా రన్ టైమ్ దానికి తోడు మధ్యలో ఇరవై నిముషాలు బ్రేక్ అంటే అటు ఇటుగా మూడున్నర గంట సినిమా అవుతుంది. మరి అంతటి భారీ రన్ టైమ్ అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. అదే ఇప్పడు ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అయితే సెన్సార్ తర్వాత రన్ కాస్త తగ్గే ఛాన్స్ లేకపోలేదు. ఎలా చూసుకున్న మూడు గంటలపైనే ఉండే అవకాశం ఉంది. షూటింగ్ చివరి దశలో ఉన్న రాజాసాబ్ జనవరి 9న జననాయగన్ సినిమాతో పోటీగా రిలీజ్ అవనుంది.
