NTV Telugu Site icon

Mad 2 : మ్యాడ్ 2 స్పెషల్ సాంగ్.. రంగంలోకి శ్రీవిష్ణు హీరోయిన్

Mad Square 1st Song

Mad Square 1st Song

Mad 2 : ‘టిల్లు స్క్వేర్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ మరో సీక్వెన్స్ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్‌’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ను తెరకెక్కిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా చేస్తున్నారు. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. నార్నె నితిన్ డెబ్యూ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది. థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. ‘మ్యాడ్ 2’లో మొదటి పార్ట్ లో ఉన్న లీడ్ యాక్టర్స్ అందరూ ఈ సీక్వెల్ లో కూడా ఉండబోతున్నారంట. మ్యాడ్ లో కాలేజ్ లైఫ్ ని చూపించిన కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్ 2’లో మాత్రం ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్ లో ఫన్ రైడ్ ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also:YS Jagan Districts Tour: క్షేత్రస్థాయికి పర్యటనకు వైఎస్‌ జగన్‌.. వారంలో 2 రోజులు జిల్లాల్లోనే..

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మలయాళీ బ్యూటీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు హీరో శ్రీవిష్ణుకి జోడీగా ‘సామజవరగమన’లో నటించిన రెబ్బా మౌనిక జాన్. ఇదివరకే కొంతమంది పేరును పరిశీలించినప్పటికీ ఆమెనే ఫైనల్ చేశారంట. త్వరలో ఆమె పైన సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి రాబోతోందని తెలుస్తోంది.

నార్నె నితిన్ ‘మ్యాడ్’ తర్వాత ఆయ్ మూవీతో ఈ ఏడాది మరో హిట్ అందుకున్నాడు. తన నాలుగో చిత్రంగా ‘మ్యాడ్ 2’ రాబోతోంది. ఈ మూవీతో సక్సెస్ అందుకుంటే నార్నె నితిన్ కి యంగ్ హీరోగా మంచి క్రేజ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ బామ్మర్ది అనే గుర్తింపుతో నార్నె నితిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తారక్ కూడా నితిన్ కి సపోర్ట్ గా ఉన్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ ని ‘లక్కీ భాస్కర్’ మూవీతో ఈ ఏడాది సూపర్ హిట్ వచ్చింది. ఏకంగా 100 కోట్లు కలెక్షన్స్ సినిమాతో అందుకున్నారు. అలాగే ‘దేవర’తో డిస్టిబ్యూటర్ కూడా కూడా మంచి లాభాలు అందుకున్నారు.

Read Also:Rashmika: పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో

Show comments